I am not able to find the sloka in any other script which I know, except Telugu…I don’t know where it came from, but it is something to note down somewhere. The English text is at the bottom.

చతుష్షష్టికళలు

వేద వేదాంగేతిహాసాగమ, న్యాయకావ్యాలంకార, నాటక, గాన కవిత్వ కామశాస్త్ర శకున, సాముద్రికారత్న పరీక్షాస్వర్ణపరీక్షా శ్వలక్షణ, గజలక్షణ, మల్లవిద్యా, పాకకర్మ దోహళ గంధవాద ధాతువాద ఖనీవాద, రసవాదాగ్నిస్తంభజలస్తంభ వాయుస్తంభ ఖడ్గస్తంష, వశ్యాకర్షణ మోహన విద్వేషణోచ్ఛాటన మారణ కాలవంచన వాణిజ్య, పాశుపాల్య కృష్యా సవకర్మలావుక యుద్ధమృగయా, రతికౌశలా దృశ్యకరణీద్యూతకరణీ చిత్రలోహ పాషాణ మృద్దారు వేణు చర్మాంబరక్రియా చౌర్యౌషధసిద్ధి స్వరవంచనా దృష్టివంచనాంజన, జలప్లవన వాక్సిద్ధి, ఘటికాసిద్ధి, ఇంద్రజాల మహేంద్రజాలాఖ్య చతుష్టష్టివిద్యా నిషద్యాయమాన నిరవద్య విద్వజ్ఞాన విద్యోతితే.

 1. వేదములు (ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అధర్వణవేదము అను నాల్గు)
 2. వేదాంగములు- వేదములకు సంబంధించిన ఆరుశాస్త్రములు :(1. శిక్షలు 2. వ్యాకరణము 3. ఛందస్సు 4. జ్యోతిషము 5. నిరుక్తము 6. కల్పములు అని వేదాంగములు. ఆరు శాస్త్రములు)
 3. ఇతిహాసములు – రామాయణ,మహాభారత, భాగవతం పురాణాదులు
 4. ఆగమశాస్త్రములు- 1. శైవాగమము 2 పాంచరాత్రాగమము 3 వైఖానసాగమము 4 స్మార్తాగమము అని ఆగమములు నాల్గు.
 5. న్యాయము: తర్కశాస్త్రమునకు పేరు
 6. కావ్యము
 7. అలంకారములు : సాహిత్యశాస్త్రము
 8. నాటకములు
 9. గానము (సంగీతం)
 10. కవిత్వము : ఛందోబద్ధముగ పద్యమునుగాని శ్లోకమునుగాని రచించడము
 11. కామశాస్త్రము
 12. ద్యూతము (జూదమాడడము): జూదమునకు సంబంధించిన సూక్తములు ఋగ్వేదములో కొన్ని ఉన్నాయి. వీనికే అక్షసూక్తమనియునందురు. కార్తిక శుద్ధ పాఢ్యమినాడు జూదమాడవలయుననియు శాస్త్రవచనములుగలవు. ఇదియు నొకకళ,
 13. దేశభాషాజ్ఞానం
 14. లిపికర్మ= దేశభాషలకు సంబంధించిన అక్షరములు నేర్పుగ వ్రాయువిధానము.
 15. వాచకము = ఏగ్రంధమైననూ తప్పులేకుండ శ్రావ్యముగ నర్థవంతముగ చదువు నేర్పు
 16. సమస్తావథానములు: అష్టావధాన, శతావధాన, నేత్రాథానాది, అవధానములలో నైపుణ్యము
 17. స్వరశాస్త్రము= ఉచ్ఛ్వాస నిశ్వాసములకు సంబంథించినదై ఇడా పింగళా సుషుమ్న నాడులకు చేరినదై చెప్పబడు శుభాశుభ ఫలబోధకమైన శాస్త్రము,
 18. శకునము= ప్రయాణ కాలమున, పక్షులు జంతువులు మానవులు, ఎదురురావడం గూర్చి గాని, ప్రక్కలకు వెళ్ళడం గూర్చి భాషించు భాషణములను గూర్చి, గమనించి తన కార్యము యొక్క శుభాశుభముల నెరుంగునట్టి శాస్త్రము
 19. సాముద్రికము= హస్తరేఖలు, బిందువులు, వగైరాలను గుర్తించి శుభాశుభముల నెరుంగజేయు శాస్త్రము
 20. రత్నపరీక్ష= నవరత్నాల గురించి వాటి ప్రభావం, వాటి నాణ్యత మొదలగు గుణాల సంపూర్ణజ్ఞానం
 21. స్వర్ణపరీక్ష= బంగారమును గుర్తించు జ్ఞానము
 22. అశ్వలక్షణము= గుఱ్ఱములకు సంబంధించిన జ్ఞానము
 23. గజలక్షణము= ఏనుగులకు సంబంధించిన జ్ఞానము
 24. మల్లవిద్య = కుస్తీలు పట్టు విధానము
 25. పాకకర్మ= వంటలు
 26. దోహళము=వృక్షశాస్త్రము
 27. గంధవాదము = వివిధములైన సువాసన వస్తువులు అత్తరు పన్నీరు వంటివి తయారుచేయు నేర్పు
 28. ధాతువాదము = రసాయన వస్తువులు నెరుంగు విద్య
 29. ఖనీవాద- గనులు వాటి శాస్త్రం .
 30. రసవాదము – పాదరసము మొదలైన వానితో బంగారు మొదలైనవి చేయు నేర్పు.
 31. అగ్నిస్తంభన – అగ్నిలో కాలకుండ తిరుగాడు రీతి.
 32. జలస్తంభన – నీళ్ళను గడ్డగట్టించి, నందులో మెలంగుట.
 33. వాయుస్తంభన – గాలిలో తేలియాడు విద్య
 34. ఖడ్గస్తంభన – శత్రువుల ఖడ్గాదులను నిలుపుదల జేయు విద్య
 35. వశ్యము – పరులను, లోబచుకొను విద్య
 36. ఆకర్షణము – పరులను, చేర్చుకొను విద్య,
 37. మోహనము – పరులను మోహింపజేయు తెరంగు.
 38. విద్వేషణము – పరులకు విరోదము కల్పించడము,
 39. ఉచ్ఛాటనము – పరులను ఉన్నచోటునుంచి వెళ్ళగొట్టడము,
 40. మారణము – పరులకు ప్రాణహాని గల్గించడము.
 41. కాలవంచనము – కాలముగాని కాలమున పరిస్ధితులు మార్పు గలిగించడము.
 42. వాణిజ్యము – వ్యాపారాదులు.
 43. పాశుపాల్యము – పశువులను పెంచడములో నేర్పు.
 44. కృషి – వ్యవసాయ నేర్పు.
 45. ఆసవకర్మ – ఆసవములను, మందులను చేయు రీతి
 46. లాపుకర్మ – పశుపక్ష్యాదులను స్వాధీనబరచుకొను రీతి.
 47. యుద్ధము – యుద్ధముచేయు నేర్పు.
 48. మృగయా – వేటాడు నేర్పు
 49. రతి కళాకౌశలము – శృంగార కార్యములలో నేర్పు.
 50. అద్మశ్యకరణీ – పరులకు కానరాని రీతిని మెలంగడము.
 51. ద్యూతకరణీ – రాయబార కార్యములలో నేర్పు.
 52. చిత్ర – చిత్రకళ
 53. లోహా – పాత్రలు చేయి నేర్పు
 54. పాషాణ – రాళ్ళు చెక్కడము(శిల్పకళ.
 55. మృత్ – మట్టితొ చేయు పనులలో నేర్పు
 56. దారు – చెక్కపని
 57. వేళు – వెదరుతో చేయు పనులు
 58. చర్మ – తోళ్ళపరిశ్రమ.
 59. అంబర – వస్త్ర పరిశ్రమ
 60. చౌర్య – దొంగతనము చేయుటలో నేర్పు
 61. ఓషథసిద్ధి – మూలికలద్వారా కార్యసాధనావిధానము
 62. మంత్రసిద్ధి – మంత్రములద్వారా కార్యసాధనము
 63. స్వరవంచనా – కంఠధ్వనివల్ల ఆకర్షణము
 64. దృష్టివంచన – అంజనవంచన – చూపులతో ఆకర్షణము
 65. పాదుకాసిద్ధి – ఇంద్రజాల మహేంద్రజాలములు తలచినచోటికి ఇంద్రజాలములనెడు గారడీవిద్య

(1) gita — art of singing.

(2) vadya — art of playing on musical instruments.

(3) nritya — art of dancing.

(4) natya — art of theatricals.

(5) alekhya — art of painting.

(6) viseshakacchedya — art of painting the face and body with colored unguents and cosmetics.

(7) tandula-kusuma-bali-vikara — art of preparing offerings from rice and flowers.

(8) pushpastarana — art of making a covering of flowers for a bed.

(9) dasana-vasananga-raga — art of applying preparations for cleansing the teeth, cloths and painting the body.

(10) mani-bhumika-karma — art of making the jewel garlands.

(11) sayya-racana — art of covering the bed.

(12) udaka-vadya — art of playing on music in water.

(13) udaka-ghata — art of splashing water on ground.

(14) citra-yoga — art of practically applying an admixture of colors.

(15) malya-grathana-vikalpa — art of designing a preparation of wreaths or garlands.

(16) sekharapida-yojana — art of practically setting the coronet on the head.

(17) nepathya-yoga — art of practically dressing

(18) karnapatra-bhanga — art of decorating the tragus of the ear.

(19) sugandha-yukti — art of practical application of aromatics.

(20) bhushana-yojana — art of applying or setting ornaments.

(21) aindra-jala — art of jugglery.

(22) kaucumara — art of disguise

(23) hasta-laghava — art of sleight of hand.

(24) citra-sakapupa-bhakshya-vikara-kriya — art of preparing varieties of foods – curries, soups, sweetmeats

(25) panaka-rasa-ragasava-yojana — art of preparing palatable drinks and fruit juices

(26) suci-vaya-karma — art of needleworks and weaving.

(27) sutra-krida — art of playing with thread.

(28) vina-damuraka-vadya — art of playing on lute and small x-shaped drum.

(29) prahelika — art of making and solving riddles. (29-a) pratimala — art of caping or reciting verse for verse as a trial for memory or skill.

(30) durvacaka-yoga — art of practicing language difficult to be answered by others.

(31) pustaka-vacana — art of reciting books.

(32) natikakhyayika-darsana — art of enacting short plays and anecdotes.

(33) kavya-samasya-purana — art of solving enigmatic verses.

(34) pattika-vetra-bana-vikalpa — art of designing preparation of shield, cane and arrows.

(35) tarku-karma — art of spinning by spindle.

(36) takshana — art of carpentry.

(37) vastu-vidya — art of engineering.

(38) raupya-ratna-pariksha — art of testing silver and jewels.

(39) dhatu-vada — art of metallurgy.

(40) mani-raga jnana — art of judging jewels.

(41) akara jnana — art of mineralogy.

(42) vrikshayur-veda-yoga — art of practicing medicine or medical treatment, by herbs.

(43) mesha-kukkuta-lavaka-yuddha-vidhi — art of knowing the mode of fighting of lambs, cocks and birds.

(44) suka-sarika-prapalana (pralapana)? — art of maintaining or knowing conversation between male and female cockatoos.

(45) utsadana — art of healing or cleaning a person with perfumes.

(46) kesa-marjana-kausala — art of combing hair.

(47) akshara-mushtika-kathana — art of talking with fingers.

(48) mlecchita-kutarka-vikalpa — art of fabricating barbarous or foreign sophistry.

(49) desa-bhasha-jnana — art of knowing provincial dialects.

(50) pushpa-sakatika-nirmiti-jnana — art of knowing prediction by heavenly voice or knowing preparation of toy carts by flowers.

(51) yantra-matrika — art of mechanics.

(52) dharana-matrika — art of the use of amulets.

(53) samvacya — art of conversation.

(54) manasi kavya-kriya — art of composing verse mentally.

(55) kriya-vikalpa — art of designing a literary work or a medical remedy.

(56) chalitaka-yoga — art of practicing as a builder of shrines

(57) abhidhana-kosha-cchando-jnana — art of the use of lexicography and meters.

(58) vastra-gopana — art of concealment of cloths.

(59) dyuta-visesha — art of knowing specific gambling.

(60) akarsha-krida — art of playing with dice or magnet.

(61) balaka-kridanaka — art of using children’s toys.

(62) vainayiki vidya — art of enforcing discipline.

(63) vaijayiki vidya — art of gaining victory.

(64) vaitaliki vidya — art of awakening master with music at dawn

Advertisements