This speech given by Sangam Lakshmibai on 01 Dec 1955 is a very beautiful composition in Telugu. It’s innocent, it’s sentimental and it’s powerful.

Some honourable members said, people from Telangana are backward, uneducated and they fear people from other states. Actually, people of this state don’t fear. There are no one here who fear. People here are not backward. The people of this area have got a special problem. This is a story. It has a history. The people of Telangana suffered from Communists, they suffered from Razakars. After suffering much, they are slowly trying to rise up now. People here are thinking of their future and are acting on various things to secure their future. Only now, they are trying to understand what is administration, what is government, what they are. Maharashtra(Marathwada) are ready to merge into Bombay and they are asking for it. What is Bombay? It’s a developed state. The land of Maharashtra is fertile. The people there are asking for merging with Bombay. But the goddess of Telanga is the goddess of rocks, the goddess of hills. This is a backward area. There are many great poets here. Potana is from here. His Bhagavatam is read by all in Andhra. Pillalamarri is from here. Bheemanna is from here. All these are from here. In what area is Telangana backward? The pure Telugu words used here are not used anywhere. That’s the culture here. There is good in Telangana. They know respect. What we have here is pure gold. People here don’t know deceit. Because our people are good, they don’t know how to crush others to advance. How can we keep a competition between a highly educated and an uneducated child? There are many people who are educated in Telangana. They are righteous. They don’t have the brain to snatch others’ oppurtunities. Some said people here are uneducated. There are people who are educated, there are very great people here. Our late Suravaram Pratapa Reddy wrote Andhrula Sanghika Charitra(The Social History of the Andhras). Government gave him a remuneration of five thousand rupees. I ask if there is anyone there who has got such accolades. Educated people here are many. But people here believe, the people there, with their talents and capabilities will create problems for the people here. People there are motivated. They are capable of deceit. That means they can cheat the people here. Thousands of people will come here with their familes and settle here. They will try to crush the locals and rise in the society. Andhra people will mesmerize Telangana. People from there will ascend by putting great pressure. We don’t know how to pressurize by shouting. We are telling the opinion of the people here. We are presenting their opinion here. How will things move on if you continuously scold and shout at us? What happened if you shout and say public opinion is for Visalandhra? The people of my constituency are demanding for a separate Telangana. Who ever want to come to my constituency are welcome. See whether they want Telangana or Visalandhra. Just because we said four words, it’s wrong to assume that people here are demanding for Visalandhra. Everyone in Tellangana wants the state of Telangana. The Government appointed a commission. Those people are good. They came here and asked the people of their opinion. What I stress is, for the next five to six years, that is till the next elections, create a new state of Telangana.

Some people here said Visalandhra. What one of the leaders asking for Visalandhra was, when there was a selection and when the selection committee elected two people from Telangana, using his power, he appointed his brother to that post and removed those two persons. These sort of things will happen frequently. They commit many atrocities to ensure the people here are backward. Excluding this, there is no difference between us and them. They are Andhras and we are Andhras. There areno walls between Bezawada and Hyderabad. There are no barriers between Guntur and Hyderabad. The people there are politically active. People here don’t have that. If there is a separate Telangana, people here will also become active like the people from Andhra. People here will develop. This is a political issue. This is a national issue. I strongly support for a separate Telangana.

Telugu original below.

కొందరు గౌరవ సభ్యులు ఏమన్నారంటే తెలంగాణా వాళ్ళు వెనకబడిన వాళ్ళు , చదువు లేని వాళ్ళు , బయటి రాష్ట్రం వాళ్ళని చూసి భయ పడుతున్నారు . అనేది . ఇక్కడ వాళ్లకు భయం ఏమి లేదు . ఇక్కడెవరు భయ పడే వాళ్ళు లేరు . ఇక్కడ వాళ్ళు వెనకబదినవారు కారు . ఇక్కడి వారికి తెలంగాణా రాష్ట్రం కావాలంటే ఇక్కడి వారికి తెలంగాణా వాళ్లకు ఒక ప్రత్యెక సమస్య ఉంది . ఇది ఒక కథ . ఒక హిస్టరీ ఉంది . తెలంగాణా ప్రజలు కమ్యునిస్టుల వలన బాధలు పడి రజాకార్ల వల్ల బాధలు పడి , అనేక కస్టాలు పడి , ఇప్పుడిప్పుడే నిమ్మళంగా పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నారు . ఇక్కడి ప్రజలు ఇప్పుడిప్పుడే తమ భవిస్యత్తు గురించి కృషి చేస్తూ , భావి జీవితం కొరకు అనేక కార్యక్రమములు మొదలు పెడుతున్నారు . ఇప్పుడే అధికారం అంటే ఏమిటో , ప్రభుత్వం అంటే ఏమిటో ,తామంటే ఏమిటో ఇక్కడి ప్రజలు తెలుసుకోగలుగుతున్నారు . బొంబాయిలో కలవడానికి మహా రాష్ట్రులు సిద్దంగా ఉన్నారు . దానికొరకు వారందరూ మాట్లాడుతున్నారు . బొంబాయి రాష్ట్రం ఎటువంటిది ? అది అభివృద్ధి పొందిన దేశం . మహారాష్ట్ర ప్రాంతం లోని భూమి సత్తువకలది . మహారాష్ట్రులు బొంబాయిలో కలవాలంటున్నారు . కాని తెలంగాణా తల్లి రాళ్ళ తల్లి . గుట్టల తల్లి . ఇది వెనక బడిన దేశం . ఇక్కడ గొప్ప గొప్ప కవులు వున్నారు . మహాకవి పోతన ఇక్కడి వాడే . ఆయన భాగవతమును అందరూ అక్కడ ఉన్న ఆంధ్ర దేశం లోని అందరు కూడా చదువుతారు . పిల్లల మర్రి ఉన్నారు . భీమన్న కవి ఉన్నాడు . వీరంతా ఇక్కడివారే . ఈ తెలంగాణా ఎక్కడ వెనకబడి ఉంది ? తెలంగాణాలో ఉపయోగించే అచ్చ తెలుగు పదాలు ఎక్కడా ఉండవు . అంత సంస్కృతి ఉన్నది . తెలంగాణాలో మంచితనం ఉన్నది . తెలంగాణాలోని వారికి మంచి మర్యాద తెలుసు . ఇక్కడ ఉన్నదంతా అచ్చాబంగారం . ఇక్కడ వాళ్లకు కపటం లేదు మోసం లేదు . మా ప్రజలు మంచితనంగా ఉండడం చేత వారికి ఇతరులను అణగదొక్కి ముందుకు పోవడం తెలియదు . బాగా చదువుకున్నవాడికి , చదువుకోని పిల్లవాడికి పోటి పెడితే ఎట్లాగు ? తెలంగాణాలో చదువుకున్న వారు చాలామంది ఉన్నారు . వాళ్ళందరూ నిజాయితిగా ఉంటారు . ఇతరులను తోసి ముందుకు పోయే తెలివి తేటలు లేవు . ఇక్కడ చదువుకున్న వాళ్ళు లేరని కొందరన్నారు . ఇక్కడ చదువుకున్నవారు , పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు . మన కీర్తి శేషులైన సురవరం ప్రతాప రెడ్డి గారు ఆంధ్రుల సాంఘీక చరిత్ర రాశారు . వారికి ఐదు వేల రూపాయలు గవర్నమెంట్ బహుమతిగా ఇచ్చింది .ఈ విధమైన గౌవరములు అక్కడి వారికి ఎవరికైనా వచ్చిందా అని అడుగుతున్నాను . ఇక్కడ కూడా చదువు కున్న వారు ఎక్కువే వున్నారు . కానీ అక్కడి వాళ్ళు చాకచక్యంతో , నేర్పుతో ,ఇక్కడవాల్లను సతాయిస్తారని ఇక్కడి వాళ్ళు అనుకుంటున్నారు . అక్కడి వారికి చైతన్యం ఉంది . ఇతరులను నమ్మించి బోల్తా కొట్టించే నేర్పు ఉంది . కాబట్టి వాళ్ళంతా వచ్చి ఇక్కడివాల్లను నమ్మించి బోల్తాకోట్టించడం జరుగుతుంది . అనేక మంది వేలదివేల ప్రజలు తల్లితండ్రులతో సంసారాలు , సంసారాలతో సహా వచ్చేస్తారు . ఇక్కడి వాళ్ళను అణిచి పైకి పోవడానికి ప్రయత్నిస్తారు . తెలంగాణకు ఆంధ్రులు వచ్చి జాదూ చేస్తారు . అక్కడి వారు ఇక్కడ గట్టి ఒత్తిడి తీసుకువచ్చి ముందుకు పోవడం జరుగుతుంది . గట్టిగా అరుస్తూ వత్తిడి చేయడం మాకు చేత గాదు . మేము ఇక్కడి ప్రజల ప్రజల అభిప్రాయం ఏమిటో తెలుపుతున్నాము . ఇక్కడి ప్రజల అభిప్రాయం మీ ముందర పెడుతున్నాము . ఊరికే తిట్టుతూ మాట్లాడితే ఎట్లాగు ? ప్రజల అభిప్రాయం విశాలంధ్రకు అనుకూలంగా ఉన్నదని గట్టిగా మాట్లాడినంత మాత్రాన ఏమైంది ? నా నియోజక వర్గంలోని ప్రజలు తెలంగాణా కావాలని అంటున్నారు . ఎవరు వస్తారో , నా నియోజక వర్గానికి రండి . వారంతా తెలంగాణా కావాలంటున్నారో , విశాలాంధ్ర కావాలంటున్నారో చూడండి . ఊరికే నాలుగు మాటలు గట్టిగా అన్నామని , ఇక్కడి ప్రజలు విశాలాంధ్ర కావాలని అంటున్నారని అనుకోవడం పొరపాటు . తెలంగాణాలోని ఆబాలగోపాలం తెలంగాణా రాష్ట్రం కావాలంటున్నారు . సర్కారు వారు ఒక కమిషన్ వేశారు . వారు బుద్ది మంతులు . వారు ఇక్కడకు వచ్చి తిరిగి ప్రజల అభిప్రాయం కనుక్కున్నారు ……నేను ఇప్పుడు ముఖ్యంగా కోరేదేమంటే ఐదారేండ్ల వరకు అంటే వచ్చే ఎన్నికల వరకు ప్రత్యెక తెలంగాణా ఏర్పాటు చేయాలని కోరుతున్నాను .
ఇక్కడి వారు కొందరు విశాలాంధ్ర అంటున్నారు . విశాలాంధ్ర కావాలనే నాయకులు ఒకరు ఏమి చేసారంటే ఏదైతే సెలక్షన్ ఉన్నదో , ఆ సెలక్షన్ తెలంగాణా వారిని ఇద్దరిని ఎన్నుకుంటే తనకు పదవి ఉన్నదని చెప్పి అందులో తన అన్నను తీసుకువచ్చి పెట్టి ఇదివరకు ఉన్నవాళ్ళను తీసివేసారు . ఇటువంటి అన్యాయాలు ఎన్నో జరుగుతాయి ….. ఇక్కడి వారు ముందుకు రాకుండా అఘాయిత్యాలు చేస్తారు . ఇటువంటి పనులు జరుగుతాయి తప్పితే మాకు వాళ్లకు భేదం లేదు . వాళ్ళు ఆంధ్రులే మేము ఆంధ్రులమే . బెజవాడ , హైదరాబాద్ ల మధ్య గోడలు ఏమీలేవు . గుంటూరు , హైదరాబాదుల మధ్య అడ్డుగోడలు ఏవిలేవు . అక్కడి వారికి ఎక్కువ రాజకీయాలు , దానిలో చలాకి తనం ఉంది . ఇక్కడి వారికి లేదు . ఈ ఐదు సంవత్సరాలు ప్రత్యెక తెలంగాణా ఉంటే ఇక్కడి వారు కూడా వాళ్ళ వలె చలాకి వాళ్ళు అవుతారు . ఇక్కడి వారు అభివృద్ధి చెంది వుంటారు . ఈ సమస్య ఒక రాజకీయ సమస్య . ఇది దేశ సమస్య .నేను గట్టిగా తెలంగాణా ఉండాలని కోరుకుంటున్నాను

Advertisements